Top
Sneha TV

'అదుగో' పందిపిల్లతో పాదయాత్ర.. ఎప్పుడు.. ఎక్కడంటే..

X

దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం 'అదుగో'. పందిపిల్ల ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 7న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రవిబాబు.. పందిపిల్లతో పాదయాత్ర చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింఛాంబర్ వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్‌లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహార్ సంగీతం అందించారు. అభిషేక్ వర్మ, నభా, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి, తదితరులు నటిస్తున్నారు.

Next Story
Share it