Top
Sneha TV

''నాకు ప్రాణహానీ ఉంది.. ఒక్కసారి ప్రజలతో మాట్లాడుతా..''

X

విజయవాడ: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తనకు ప్రాణహాణీ ఉందని, తనను ఒక్కసారి ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని శ్రీనివాసరావు కోరాడు. పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాసరావు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు అతన్ని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం తిరిగి అతన్ని కస్టడీకి తరలిస్తుండగా... తనకు ప్రాణహాణి ఉందని, ఒక్కసారి ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని శ్రీనివాసరావు వేడుకున్నాడు.

జగన్‌పై దాడి అనంతరం నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ దర్యాప్తు బృందం మూడు రోజులుగా శ్రీనివాసరావును విచారిస్తోంది. నేడు కూడా అతన్ని విచారిస్తుండగా.. ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు.. అతను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గుర్తించారు. చికిత్స చేసేందుకు వైద్యులు ప్రయత్నించగా.. శ్రీనివాసరావు అందుకు నిరాకరించినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా తన అవయవాలను దానం చేస్తానంటున్నాడని తెలిపారు.

ఇదిలాఉండగా.. కస్టడీలో ఉన్న వ్యక్తికి 48 గంటలకోసారి వైద్యపరీక్షలు చేయించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తీసుకువచ్చామని చెబుతున్నారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి విచారణ కొనసాగుతుందని సిట్ అధికారులు తెలిపారు. శ్రీనివాసరావు పరిస్థితి ఆందోళనగా ఏమీ లేదని, విచారణలో బాగంగా నిరంతరం ప్రశ్నించడంతో అలసిపోవడం సహజమేనని పేర్కొన్నారు

Next Story
Share it