Top
Sneha TV

కంటి వెలుగు పథకం కేసీఆర్‌కు పనికిరాలేదా?: ఎల్‌. రమణ

X

హైదరాబాద్: మోది దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని.. అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబు వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోది దగ్గర తాకట్టు పెట్టిందెవరని కంటి వెలుగు పథకం కేసీఆర్‌కు పనికిరాలేదా? అని విమర్శించారు. తన ఢిల్లీ పర్యటనపై హరీష్, కేటీఆర్, కవిత అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి, పంటి పరీక్షల పేరుతో కేసీఆర్‌ ఢిల్లీలో రహస్య మిత్రులను కలిశారని ఆరోపించారు. దొంగ సొమ్ముకు అడ్డాగా ప్రగతి భవన్‌ను మార్చారని, తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చుతామని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయ క్షేత్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తనను జీవన్‌రెడ్డిని జోడెద్దులతో పోల్చటం గర్వంగా ఉందని రమణ ఆనందం వ్యక్తం చేశారు.

Next Story
Share it