Top
Sneha TV

తెలంగాణ సీఈవో రజత్‌కుమార్‌కి ఏపీ డీజీపీ ఠాకూర్‌ నివేదిక

X

అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుళ్లు డబ్బులు పంపిణీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీ డీజీపీ ఠాకూర్ తెలిపారు. ఈ విషయమై తెలంగాణ సీఈవో రజత్‌కుమార్‌కి ఏపీ డీజీపీ ఠాకూర్‌ నివేదిక సమర్పించారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి నివేదిక తీసుకున్నామని, ఎన్నికల సంఘం పంపిన వీడియోలో నగదు పంపిణీ లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, తెలంగాణలో ఏపీ వీఐపీలు సహా వారి ఆస్తులు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం ఉందని, మావోయిస్టుల కదలికలను గుర్తించడం కోసమే తెలంగాణలో విధులు అప్పగించినట్లు డీజీపీ ఠాకూర్ తెలిపారు.

Next Story
Share it