Top
Sneha TV

ప్రకృతికి ముప్పు వాటిల్లే ప్రమాదం

X

ప్రజావాక్కు

ప్రకృతికి ముప్పు వాటిల్లే ప్రమాదం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వెంక టేశ్వర్లపల్లి,తిరుమలగిరి,రావ్ఞలపల్లి గ్రామాలను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొన్నిసంవత్సరాల కిందటే అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే అది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల కిందటే చింతగట్టు గుట్టల్లోఉన్న లాటరైట్‌ ఖనిజాలను వెలికితీసేందుకు ప్రభుత్వంక్వారీ కాంట్రాక్టులకు అనుమతులు మంజూరు చేసిం ది.ఒక వైప్ఞప్రభుత్వం ఈ గుట్టలను టూరిజం స్పాట్‌గా మారు స్తామంటూనే, మరో వైప్ఞ అక్కడ త్రవ్వకాలకు అనుమతులు ఇచ్చింది.ప్రకృతి ప్రేమికులు,మేధావ్ఞలు, పరిసరగ్రామాల ప్రజ లు ఆ ప్రాంతంలో త్రవ్వకాలు ప్రారంభిస్తే వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బుగులోని, పాండవ్ఞల,చింతగట్టుగుట్టలకుపెద్ద ఎత్తున ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతు న్నారు.ఇప్పటికైనా ఈప్రతిపాదనను విరమించుకొని చారిత్రక, వారసత్వ సంపదలను కాపాడుకోవాలి. -చిరిపోతుల శ్రీనివాస్‌, జయశంకర్‌ భూపాలపల్లి

ఎవరి లబ్ధికోసం నిరుద్యోగ భృతి?
అరవై సంవత్సరాల వయసు ఉన్నవారికి ఇస్తున్నారు, ఇరవై ఏళ్ల వయసు ఉన్నవారికి పెన్షన్‌ ఇస్తున్నారు. ఎవరి లాభం కోసం ఈ విధానాలు. నిరుద్యోగులకు సరైన శిక్షణ ఇస్తే, వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారు. కాని వాళ్లను సోమరిపోతులను చేయడానికి ఈ భృతి. ఎటుపోతుంది ఈ సమాజం. ప్రపం చంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్నారు. అంతో ఇంతో తెలివి ఉండి ఏమైనా కొత్త ఆలోచనతో ఏదైనా చేద్దామంటే అడుగడుగునా అవినీతి. తెలివి ఉన్నవాళ్లు ఇక్కడ ఉండలేక, వారి తెలివిని, విదేశాలలో కిలోల చొప్పున అమ్ముకుంటున్నారు.
-వేముల శరత్‌బాబు, మహబూబాబాద్‌జిల్లా

నిఘా పెంచాలి
రెండు తెలుగు రాష్ట్రాలలో నకిలీ చిట్‌ఫండ్‌ కంపెనీల హవా అప్రతిహతంగా సాగుతోంది. అన్ని నిబంధనలను ఉల్లంఘించి అమాయకులైన ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి లక్షల్లో డబ్బు వసూలు చేసి అనంతరం బోర్డు తిప్పేయడం ఆనవాయితీగా మారింది.వీరి రోజువారి వ్యవ హారాలను ఎప్పటికప్పుడుపర్యవేక్షించేందుకు రెండు రాష్ట్రా లలో రిజిస్ట్రేషన్స్‌ కార్యాలయాలలో ప్రత్యేక మానిటరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
-సి.హెచ్‌.సాయిరిత్విక్‌, నల్గొండ

మన్‌ కి బాత్‌ను వినియోగించుకోండి
యావత్‌ ప్రతిపక్షాలు, అప్పుడప్పుడు ప్రింట్‌మీడియా నిత్యం ఫస్ట్‌పేజీలో తాటికాయసైజు అక్షరాలతో గంటగంటకీ ప్రసార మాధ్యమాలు భయంకర విషయాలపై గగ్గోలు పెడుతుంటే ఆ వార్తలు విదేశాలవారివేమోఅన్నట్లుగా,వాటిని పట్టించు కోకుండా ఇక దేశంలో ఎటువంటి సమస్యలు లేనట్లు ప్రజలారా! మీ అ మూల్య సూచనలను సలహాలను ఫలానా నెంబర్‌కి దయచేసి, తెలపండి, పంపండి.అని ప్రసారమీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం వింతగా ఉంది. ఇంతకూ మనం ఉన్నది పవిత్ర భారతదేశంలోనా అన్న సందేహం కలిగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం.మన్‌ కి బాత్‌లో ఈ నిత్య సమస్యలకు పరిష్కా రాలను ప్రస్తావించలేకపోతే మన్‌ కి బాత్‌ పేరు చెప్పగానే ఆమడ దూరంలో ఉంటారు.
-సి.వి.ఆర్‌.కృష్ణ, హైదరాబాద్‌

కొద్ది మంది చేతుల్లోనే ధనం
దేశంలో కొద్దిమంది సంపన్నులు ప్రపంచపటంలో అధిక సంపన్నుల స్థానం సంపాదించుకోవడం ఒక్కటే అభివృద్ధికాదు. ప్రతి వ్యక్తి తన అవసరాల మేర తగినంత ఆదాయాన్ని సం పాదించుకుంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలిగితే దాని ని అభివృద్దిగా పేర్కొనవచ్చు. కనీస అవసరాలైన తిండి, బట్ట, గూడు అందరికి అందిన నాడు దానిని అభివృద్ధిగా చెప్పు కోవచ్చు.సమాజంలో అంతరాలు తొలిగిననాడు,సాంఘిక దురా చారాలు తొలిగిపోయిననాడుదానిని అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. మంచి విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చిననాడు, సమాజంలో మితిమీరిపోతున్న చెడుకు కళ్లెం పడిననాడు, మతం పిచ్చి అంతమొందిననాడు అభివృద్ధిగా పేర్కొనవచ్చు.
-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

ధరలను అదుపులో ఉంచాలి
విమాన టిక్కెట్లకి స్థిరమైన ధర నిర్ణయించాలి. రోజుకొక తీరున ఉన్న ధరలు సామాన్య మానవ్ఞలు భరించలేరు. అలాగే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు తీసుకువెళ్లే ప్యా కేజీ విమాన ధరలు ముందే నిర్ణయించి సూచిక బోర్డులు ప్రదర్శించాలి.ప్రయాణికులు వెళ్లాల్సినదూరం ఎంతైనాసరే వారికి ఆహార పదార్థాలు, మంచినీటిని అందించాలి. విమా న ప్రయాణికులు ఎక్కువ మొత్తాలను చెల్లించి టిక్కె ట్టును కొనుగోలు చేస్తారు.వారికి అవసరమైన అన్ని సదు పాయా లు కల్పించాల్సిన బాధ్యత విమానయాన రంగంపై ఉంది

Next Story
Share it