Top
Sneha TV

జగన్‌కు చురకలంటించిన జేసీ

X

విజయవాడ: ప్రతపక్ష నేత జగన్‌కు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చురకలంటించారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని, ఆప్ఘానిస్థాన్ పోలీసులను అయితే నమ్ముతారని జేసీ ఎద్దేవాచేశారు. భుజం గాయంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్‌కు ముందు ఆయన్ను ఏపీ సిట్ అధికారులు కలిశారు. దాడి ఘటనపై జగన్ స్టేటిమెంట్‌ను రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. ఇతర ఇన్వెస్ట్‌గేటివ్‌తో వస్తే స్టేటిమెంట్‌ ఇస్తానని తెలిపారు. జగన్ స్టేటిమెంట్ ఇవ్వకపోవడంతో చికిత్సకు సంబంధించిన రిపోర్టులను పోలీసులు తీసుకెళ్లారు.

ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు. విచారణ బాధ్యతలను మరేదైనా రాష్ట్ర పోలీసులకు లేదా ఏదైనా దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలి' అంటూ జగన్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఘటన వివరాలు చెప్పాలంటూ 160 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసును స్వీకరించేందుకు కూడా నిరాకరించారు. ఇదే విషయాన్ని జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసు ప్రతిపై రాసిచ్చారు. ''ప్రచారం కోసం జగన్‌ అభిమానే దాడి చేసినట్లు స్వయంగా డీజీపీ, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసును తీసుకోవడంలేదు. అలాగే... వారి నేతృత్వంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న దర్యాప్తు తీరు తెన్నులపైనా మాకు నమ్మకం లేదు'' అని సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చారు. ఆతర్వాత ఏసీపీ వెనుతిరిగి పోతుండగా... జగన్‌ ఆయనను వెనక్కి పిలిచి సుమారు 20 నిమిషాలపాటు మాట్లాడారు.

Next Story
Share it