Top
Sneha TV

రూ.99తో 2018 వరకు జియో ఉచితం....

X

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లకు మార్చి 31, 2017తో తెరపడబోతోంది. ఏప్రిల్ 1, 2017 నుంచి జియో సేవలు అందుబాటుకు సంబంధించి ఆ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వివరాలను వెల్లడించారు. మంగళవారంలో ముంబైలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా రిలయన్స్ జియో భవిష్యత్‌ను ఉద్దేశించి అంబానీ తీసుకున్న కీలక నిర్ణయాలు జియో కస్టమర్‌లకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయా..? వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఎలా..?

సెప్టంబర్, 2016 నుంచి రిలయన్స్ జియో సేవులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. తొలత వెల్‌కమ్ ఆఫర్ పేరుతో జియో ఉచిత సేవలను ఆఫర్ చేయటం జరిగింది. వెల్‌కమ్ ఆఫర్ ముగిసిన తరువాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ మార్చి 31, 2017తో ముగియనుంది. ఏప్రిల్ 1, 2017 జియో డేటా సేవలు పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.

మార్చి 31, 2017తో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగస్తున్నప్పటికి, దేశవ్యాప్తంగా ఉన్న తన 10 కోట్ల మంది చందాదారులకు మేలు చేకూర్చే క్రమంలో Jio Prime పేరుతో సరికొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను రిలయన్స్ జియో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి Jio Prime మెంబర్‌షిప్ ప్లాన్‌ను పొందవల్సి ఉంటుంది. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు జియో వాయిస్ కాల్స్ ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు వర్తించవు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

డేటా సేవలను పొందాలంటే నెలకు రూ.303 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్ యూజర్లు ప్రతినెలా రూ.303 చెల్లించిటం ద్వారా మార్చి 31, 2018 వరకు జియో న్యూ ఇయర్ ఆఫర్ తాలుకూ అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి నెలా లభించే 30జీబి డేటాను రోజుకు ఒక డేటా చొప్పున నెలమొత్తం వాడుకోవచ్చు . ఇదే సమయంలో జియో యాప్స్ ను కూడా ఉచితంగా వాడుకోచ్చు.

Jio Prime మెంబర్‌షిప్‌ను పొందాలనుకునే జియో యూజర్లు మార్చి 31 లోపు జియో అఫీషియల్ వెబ్‌సైట్ లేదా సమీపంలోని జియో స్టోర్‌లలోకి వెళ్లి రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

జియో ప్రైమ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన రూ.303 ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి చొప్పున నెలకు 30 జీబీల డేటా లభిస్తుంది.రోజు 1జీబి లిమిట్ దాటిన తరువాత డేటా వేగం కాస్తా 128 kbpsకు పడిపోతుంది.

Next Story
Share it