Top
Sneha TV

తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుంది: కెటిఆర్‌

X

హైదరాబాద్‌: తాజ్‌ డెక్కన్‌లో రాష్ట్ర బిల్డర్ల సమాఖ్య నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతు 2001లో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఏర్పాటు అయ్యాయి. ఆ రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధి అతంత మాత్రమే అని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. పేర్కొన్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పరిశ్రమలు అన్ని తరలిపోతాయని ప్రచారం చేశారు. ఒకప్పుడు పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చిన పరిస్థితి. గతంలో మూడు విడుతల్లో ఆరు గుంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేసేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కెటిఆర్‌ చెప్పారు. ఇప్పుడు పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు

Next Story
Share it