Top
Sneha TV

కేజ్రీవాల్, శరద్ యాదవ్ ని కలిసిన సీఎం చంద్రబాబు!

X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటు సభ్యులతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. అంతే కాదు జగన్ పై దాడి, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి, పలు ప్రాజెక్టులపై కేంద్రం సహాయ నిరాకరణ సహా పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రం కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకపోవడం, టీడీపీ నేతలు, మద్దతుదారులు లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు జాతీయ మీడియా సమావేశంలో ప్రస్తావించనున్నారు.ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం యత్నిస్తోందని భావిస్తున్న టీడీపీ అధినేత.. ప్రధాని మోదీ ఎత్తులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు సీబీఐలో జరుగుతున్న అధికార పోరుపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా 'డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ' పేరుతో సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

Next Story
Share it