Top
Sneha TV

31 తర్వాత ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఆస్తుల విక్రయం?

X

ముంబయి: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)కు ప్రభుత్వం నియమించిన బోర్డు ఈ నెల 31న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌కు తమ ప్రణాళికను సమర్పించనుంది. ఆ తర్వాత మూడు, నాలుగు వారాల్లో దీనిని రుణదాతలు, వాటాదారుల ఎదుట పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంది. డిసెంబర్‌ నాటికి ఆస్తుల విక్రయానికి బిడ్స్‌ను ఆహ్వానించనుంది.

ఇప్పటికే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బోర్డు నియామకం, పునరుజ్జీవ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ఎన్‌సీఎల్‌టీ బుధవారం తీర్పును ఇవ్వనుంది. ఈ సంస్థ బోర్డు శుక్రవారం భేటీ కానుంది. విక్రయించే ఆస్తులకు పూర్తి విలువను రప్పించుకోవడం సవాళ్లతో కూడిన పని. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం ఆశావహంగా లేకపోవడంతో ఆస్తుల విక్రయానికి ఇది సరైన సమయం కాదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయలో రుణదాతలకు సర్దిచెప్పడం కూడా పెద్ద సవాలే.

'ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన చాలా ప్రాజెక్టులు చేతులు మారితే మంచి రాబడిని అందిచగలవు. కానీ, వాటికి మంచి ధర లభించే పరిస్థితి లేదు. దీనిని గుర్తించి అమ్మకాలు జరిపితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది' ఒక స్థిరాస్తి రంగ నిపుణుడు పేర్కొన్నారు.

Next Story
Share it