Top
Sneha TV

రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

X

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. 'నన్ను తక్కువగా అంచనా వేయొద్దు... రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ'.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమై వెళ్తున్నారు. మరోవైపు శనివారం ఉదయం 10 గంటల కల్లా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందుగా ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులు, జగన్‌పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

జాతీయ మీడియాతో జరిగే సమావేశంలో చంద్రబాబు.. గవర్నర్ వ్యవస్థపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో వేలు పెడుతున్నారంటూ చంద్రబాబు నిన్ననే మండిపడ్డారు. గవర్నర్.. ఏపీ డీజీపీకి ఫోన్ చేసి జగన్‌పై జరిగిన దాడిపై నివేదిక అడిగిన నేపథ్యంలో చంద్రబాబు కన్నెర్ర జేశారు

Next Story
Share it