Top
Sneha TV

స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణం రూ.888 నుంచే..!

X

ఇంటర్నెట్‌డెస్క్‌: పండుగ సీజన్‌ సందర్భంగా ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీయ విమాన సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఇండిగో సంస్థ దేశీయ ప్రయాణాలకు తమ విమాన టికెట్ల ధరలు రూ.899 నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఇప్పుడు స్పైస్‌జెట్‌ కూడా అలాంటి ఆఫర్‌నే ప్రవేశపెట్టింది. కేవలం రూ.888 నుంచే డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య చేసే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, టిక్కెట్‌ బుక్‌ చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబరు 28 అని పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం ఇండిగో రూ.899 నుంచే విమాన టికెట్‌ ధరలు అని ప్రకటించింది. ఈ ఆఫర్‌ మూడు రోజులకే పరిమితం చేసింది. దీపావళి ప్రత్యేక సేల్‌ కింద అక్టోబరు 26 వరకూ ప్రత్యేక ధరల్లో టిక్కెట్లు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద 10 లక్షల సీట్లు కేటాయించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

దేశీయ విమాన రంగం 2025 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపణిగా అవతరించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ లెక్కల ప్రకారం.. ఏటా సగటున 21.2 శాతం మంది విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు.

Next Story
Share it