Top
Sneha TV

నిజామాబాద్‌ లో దారుణం చోటుచేసుకుంది..

X

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితను బెదిరించిన యువకుడు మరో ఇద్దరితో కలిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌కు చెందిన వివాహిత(33)కు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త మానసిక స్థితి సరిగా లేదు. ఎనిమిదేళ్ల కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. ఏడాది కిందట జగిత్యాలకు చెందిన నగేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఇదే అదును చేసుకొని నగేష్ ఆమెను లోబర్చుకునేందుకు ట్రై చేసాడు. కానీ ఆమె మాత్రం నగేష్ ను దూరం పెట్టింది. దీంతో ఫోన్లోని మాటలను బయటపెడతానని బెదిరించాడు. ఆ వివరాలు కావాలంటే తాను చెప్పిన చోటుకు రావాలని కోరాడు. నిస్సహాయ స్థితిలో బాధితురాలు ఆదివారం కుమారుడిని వెంటబెట్టుకుని జగిత్యాలకు వెళ్లింది.

''బస్సు దిగగానే కుమారుడిని ఓ వ్యక్తి వెంటతీసుకెళ్లగా..మరోఇద్దరు నన్ను కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నన్ను, నా బిడ్డను బస్టాండులో వదిలేసి వెళ్లారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పుట్టి పెరిగిన నిజామాబాద్‌ వెళ్లానంటూ' బాధితురాలు నిజామాబాద్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. సదరు బాధితురాలు తెలిపిన వివరాలను బట్టి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Next Story
Share it