Top
Sneha TV

మెట్రో స్టేషన్లో పట్టాలు దాటితే జైలుకి వెళతారు

X

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌లలో ఒక ప్లాట్‌ఫారం నుంచి మరో ప్లాట్‌ఫారం వైపుకు వెళ్ళేందుకు రైల్వే ట్రాక్‌ను దాటితే మెట్రోరైలు యాక్టు ప్రకారం 6 నెలల జైలు శిక్ష, లేదా రూ.500 జరిమానా ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైళ్ళు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, వేగంతో పాటు ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్‌ దాటడం ప్రయాణికులకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. దేశంలోని ఇతర మెట్రోల్లో రైల్వే ట్రాక్‌లను దాటుతూ తీవ్ర ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story
Share it