Top
Sneha TV

జగన్‌పై దాడి ఘటనపై మంత్రి లోకేష్ ట్వీట్

X

హైదరాబాద్: విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికి దాడులకు ఈ సమాజంలో తావు లేదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా.. ఉంటే ఏపీ ప్రభుత్వంతో పాటు పలువురు మంత్రులు ఘటనపై స్పందించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావని పేర్కొన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దాడిని ఖండిస్తున్నామన్నారు.

Next Story
Share it