తెలంగాణ లో బ్యాంకు కొలువులు..
తెలంగాణ రాష్ట్రం లో మరోసారి బ్యాంకు కొలువులు తలుపు తట్టాయి..తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 96 పోస్టులుకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 41 పోస్టులను మేనేజర్ స్కేల్-1కు కేటాయించగా , 55 పోస్టులను స్టాఫ్ అసిస్టెంట్‌కు కేటాయించారు. ఈ పోస్టులకు గాను అభ్యర్దులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో మాత్రమే పంపవలెను.
ఈ పోస్టులు కేవలం తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు మాత్రమే. ఇకపోస్టుల వివరాల్లోకి వెళ్తే..
మేనేజర్ స్కేల్-1 :
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్‌లో డిగ్రీ పొంది ఉండాలి.
ఫీజు వివరాలు : ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.100, జనరల్ అభ్యర్థులకు రూ.600
స్టాఫ్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీనుంచి డిగ్రీ
ఫీజు వివరాలు : ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.100, జనరల్ అభ్యర్థులకు రూ.600
ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించు తేదీలు: 22-02-17 నుంచి 04-03-2017
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 04-03-2017
పరీక్ష తేదీలు:
మేనేజర్ స్కేల్-1 : 25-03-2017
స్టాఫ్ అసిస్టెంట్ : 26-03-2017