Top
Sneha TV

నీరవ్‌ కేసులో రూ.225 కోట్లు జప్తు

X

న్యూదిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం సూత్రధారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.255 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాల్ని హాంకాంగ్‌లోని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) తాత్కాలికంగా జప్తు చేసింది. దీంతో నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ ఛోక్సీకి సంబంధించి ఈడీ జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,744 కోట్లకు చేరింది. ఈ విలువైన ఆభరణాలు దుబాయ్‌లోని తన ఆభరణాల సంస్థల నుంచి హాంకాంగ్‌లో ఉన్న సంస్థలకు ఎగుమతి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా ఈ విలువైన ఆభరణాలకు సంబంధించి ఎగుమతి అయిన వివరాలు, వాటి యాజమాన్య హక్కులు ఎవరిపై ఉన్నాయనే వివరాలన్నీ సంపాదించామని, ఈ ఆధారాల ద్వారానే ఆభరణాలను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన నీరవ్‌మోదీ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణం ఈ ఏడాది మొదట్లో వెలుగులోకొచ్చింది. సుమారు రూ.6,400 కోట్ల బ్యాంకు సొమ్మును తన కుటుంబ సభ్యల పేర్లపై ఉన్న డమ్మీ సంస్థలకు నీరవ్‌ బదలాయించారని గతంలో ఈడీ చార్జిషీట్‌ సైతం దాఖలు చేసింది.

Next Story
Share it