Top
Sneha TV

పోలవరం పనులపై శ్వేతపత్రం ప్రకటించాలి: ఉండవల్లి

X

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని చెబుతూనే మే నెలలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. పోలవరం పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సీపాల్టీల్లో 8 శాతం వడ్డీకి కమర్షియల్ బ్యాంకుల నుంచి 12,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు జీవో విడుదల చేశారని, అయితే ఆఖరి 4 నెలల్లో ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని పట్టుబట్టారు. రాజధాని పేరుతో అప్పులు చేసినా శాశ్వత భవనాలు లేవన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నించదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ధర ప్రకారం ఇసుక దొరికితే తన ఆరోపణలు వెనక్కి తీసుకుంటానన్నారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే తనకు నష్టం లేదని ఉండల్లి తెలిపారు

Next Story
Share it