Top
Sneha TV

పళనిస్వామి ప్రభుత్వనికి మద్రాస్‌ హైకోర్టులో ఊరట

X

చెన్నై: తమిళనాడులో పళనిస్వామి సర్కారుకు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యెలపై స్పీకర్‌ విధించిన ఆనర్హత వేటు సరైనదేనని న్యాయమూర్తి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈవిషయం పై జూన్‌ 14ర ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పలురకాలు తీర్పులు ఇచ్చింది. దీంతో తుది తీర్పును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. జూలై21నుండి కేసు విచారణ జరిపిన మూడో న్యాయమూర్తి సత్యనారాయణ ఆగస్టు31వ తేదిన తీర్పును వాయిదా వేశారు. ఈనేపథ్యంలోనే18 మంది ఎమ్మెల్యెలపై ఆనర్భత వేటు సరైనదేనని న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Next Story
Share it