Top
Sneha TV

తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే బహుమతి

X

ళూరు : తన పెంపుడు కుక్క తప్పిపోయిందని, దీని ఆచూకీ చెప్పిన వారికి ఇరవైవేల రూపాయలు బహుమతిగా ఇస్తానని ఓ వ్యాపారి బెంగళూరు నగరంలో పోస్టర్లు వేసిన ఉదంతం వెలుగుచూసింది. బెంగళూరు నగరంలోని బసవనగుడి ప్రాంతానికి చెందిన వాసుదేవ్ వ్యాపారి. ఇతని కుటుంబం ఏడాదిన్నర వయసున్న లాసా ఆప్సో జాతికి చెందిన కుక్కకు 'కూపర్' అనే పేరు పెట్టి పెంచుకుంటున్నది. వాసుదేవ్ తన కుటుంబసభ్యులు ఈ నెల 19వతేదీన తన పెంపుడు కుక్క 'కూపర్' తో కలిసి డిన్నర్ చేసేందుకు అంబేద్కర్ వీధిలోని రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్ లోకి కుక్కను అనుమతించమని చెప్పడంతో దాన్ని గేటు సెక్యూరిటీ వద్ద వదిలి భోజనానికి లోపలకు వెళ్లారు. భోజనం చేసి తిరిగి వచ్చి చూస్తే కుక్క పారిపోయిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. కూపర్ జాగిలం తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదుచేసిన వాసుదేవ్ పరిసర ప్రాంతాల్లో గాలించినా దాని ఆచూకీ లభించలేదు. కూపర్ తమ కుటుంబంలో ఒకటని, అది తప్పిపోయిందని తన భార్య మనోవేదనకు గురైందని , దీని ఆచూకీ చెప్పిన వారికి 20వేల రూపాయలు బహుమతి ఇస్తానంటూ వాసుదేవ్ నగరంలోని వీధుల్లో పోస్టర్లు వేశారు. కూపర్ కుక్క సమాచారం తెలిస్తే 9844060003కి ఫోన్ చేయాలని వాసుదేవ్ కోరుతున్నారు.

Next Story
Share it