Top
Sneha TV

ఎంఐఎం, టిఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే..

X

రజకార్ల పాలనను తెలంగాణ ప్రజలు మరిచిపోరు
-కేంద్ర మంత్రి జెపి నడ్డా
హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలతో కేసీఆర్‌ డబ్బులు వృధా చేస్తున్నారని తన సొంత స్వార్థ రాజకీయం కోసమే ముందస్తు ఎన్నికలు తీసుకువచ్చాడని కేంద్ర మంత్రి,బిజెపి తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ జెపి నడ్డా అన్నారు.మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈసందర్భంగా నడ్డా మాట్లాడుతూ తెలంగాణలో ఎంఐఎం,టిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని వారికి ఓటేస్తే మళ్లీ రజాకార్ల పాలనను చూడాల్సివస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ రజాకార్ల పాలన మరిచిపోలేదన్నారు. అలాంటి ఎమ్‌ఐఎమ్‌తో జతకట్టిన టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్దిచెప్పాలన్నారు.ఇండ్ల నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం నిధులు ఇసే అవి ఏంచేశారో తెలియదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి 14వ ప్రణాళిక సంఘం ద్వారా లక్ష 26వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చుచేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలలో ఒక్కటికూడా నెరవేర్చలేదని డిసెంబర్‌ 7న కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తామని తెలిపారు.అందుకు ఎయిమ్స్‌కు ఇప్పటికే 12వందల కోట్లు ఇచ్చామన్నారు.

ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలు కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. దేశమంతా మోదీ పాలనను స్వాగతిస్తుందని..తెలంగాణలో కూడా స్వాగతించాలని పేర్కొన్నారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయఢంకా మోగిస్తుందని..19రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం నడుస్తుందన్నారు.బిజెపి ఆధ్వర్యంలోనే సామాన్యులకు అవకాశాలు లభిస్తున్నాయని.టిఆర్‌ఎస్‌,కాంగ్రేస్‌లలో వారి కుటుంబాలలకు సీట్లు కేటాయించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తునానరని అన్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌,కాంగ్రేస్‌లకు ఓటేస్తే మజ్లిస్‌ పార్టీకి ఓటేసినట్లేనని మజ్లిస్‌ ఎలా చెబితే అలా టిఆర్‌ఎస్‌ చేస్తుందని విమర్శించారు.మజ్లిస్‌ పార్టీని ఓడించే దమ్మున్న పార్టీ బిజెపియేనని అన్నారు.ఈకార్యక్రమంలో బిజెపి నగర మాజీ అధ్యక్షులు బద్దం బాల్‌రెడ్డి, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రామన్‌గౌడ్‌,వెంకట్‌రెడ్డి బిజిపి నగర ఉపాధ్యక్షులు రాహుల్‌చంద్రా నాంపల్లి నియోజకర్గంలోని వివిధ డివిజన్‌ల అధ్యక్షులు పాల్గొన్నారు.

Next Story
Share it