Top
Sneha TV

సెల్ఫీలతో చావులు

X

ఫుల్లుగా స్మార్ట్ ఫోన్లు వాడేస్తూ అర్థాంతరంగా చావుని కొనితెచ్చుకుంటున్నారు ఇప్పటి జనం. క్రియేటివ్ ఫొటోలు దిగాలనే తాపత్రయంతోనో.. మరొకటో నూరేళ్ల నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ సెల్ఫీలకు ఎక్కువగా బలైపోతున్నారు. మన ఇండియాలోనే ఈ జాడ్యం ఎక్కువగా కనిపించడం బాధాకరం. 2011 - 2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 259 మంది సెల్ఫీల కారణంగా చనిపోయారని అమెరికాలోని వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించి ప్రాణాలు పోయిన ఘటనలే ఈ లెక్కల్లో ఎక్కువ. అయితే, ఈ దుర్ఘటనలు ఎక్కువ జరిగింది మాత్రం భారతదేశంలోనే. దాదాపు 159 ఇండియాలో సెల్ఫీలకు ప్రాణాలొదిలారట. ఇదే సమయంలో రష్యాలో 16మంది సెల్ఫీలకు చావుతెచ్చుకోగా, 14 మందితో అమెరికా చివరి స్థానంలో ఉంది.

అయితే, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రాణాలొదిలిన వాళ్ల వయసు పరిశీలిస్తే, ఎక్కువశాతం 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న వారే. తరువాత 20 - 29 వయస్సువాళ్లు ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో అధికులు. అయితే, ఈ సర్వే అధ్యయన ఫలితాలు వికీపీడియా, ట్విట్టర్ నుంచి సేకరించిన సమాచారం మేరకు లెక్కకట్టినవే. రీజినల్ లాంగ్వేజస్ కు చెందిన పేపర్లు, స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం సేకరించి ఉంటే మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందనేది కొసమెరుపు.

Next Story
Share it