Top
Sneha TV

సుప్రీంకు చేరిన సీబీఐ వివాదం

X

సెలవు ఆదేశాలపై పిటిషన్‌ దాఖలు చేసిన అలోక్‌వర్మ

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో అధినాయకుల మధ్య మొదలైన వర్గ పోరు కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పుడీ వివాదాలు సుప్రీంకోర్టుకు చేరాయి. విభేదాల నే పథ్యంలో ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం.. సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను జాయింట్‌ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించింది. రాత్రికి రాత్రే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే కేంద్ర నిర్ణయాన్ని అలోక్‌ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది.

మరోవైపు అర్ధరాత్రి తర్వాత డైరెక్టర్‌గా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే ఆయన ఆధ్వర్యంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాల ఛాంబర్లను సీజ్‌ చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు సీబీఐ వర్గాల సమాచారం.

Next Story
Share it