Top
Sneha TV

మంగళసూత్రం, మెట్టెలు తీయించిన పరీక్షా కేంద్రంపై వేటు

X

మెదక్: గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రంలో రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. కొందరు మహిళా అభ్యర్థుల నుంచి మంగళసూత్రం, మెట్టెలు తీయించడంపై టీఎస్‌పీఎస్సీ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు పాల్పడిన నర్సాపూర్‌లోని వీఆర్వో పరీక్షా కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని మెదక్ కలెక్టర్‌కు టీఎస్‌పీఎస్సీ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. నిన్న వీఆర్వో పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు అభ్యర్థినుల మంగళసూత్రాలు, మెట్టెలు తీయించారు. ఘటనపై టీఎస్‌పీఎస్సీకి మెదక్ కలెక్టర్ ఈరోజు నివేదిక సమర్పించారు. నలుగురైదుగురు మహిళలు మాత్రమే ఇబ్బంది పడ్డారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

Next Story
Share it