Top
Sneha TV

మళ్లీ కన్ను కొట్టిన రాహుల్‌గాంధీ.. వీడియో

X

భోపాల్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి కన్ను కొట్టారు. ఎప్పుడైతే పార్లమెంట్‌లో మోదీని ఆలింగనం చేసుకున్న తర్వాత కన్నుకొట్టారో.. అప్పటి నుంచీ రాహుల్ ఎక్కడికి వెళ్లినా కెమెరాలు నిశితంగా ఆయనను ఫాలో అవుతున్నాయి. ఆ మధ్య రాజస్థాన్‌లో ప్రచారం సందర్భంగా స్టేజ్‌పైనే రాహుల్ కన్నుకొట్టారు. తాజాగా మధ్యప్రదేశ్ వెళ్లిన రాహుల్.. భోపాల్‌లో రోడ్ షో సందర్భంగా అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలను చూసి కన్ను గీటారు. రోడ్ షోలో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న ఓ టీ స్టాల్‌లో చాయ్ తాగుతూ, సమోసా తింటూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఈ వీడియోను కాంగ్రెస్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అయితే ఇదే వీడియో చివర్లో రాహుల్ కెమెరా వైపు చూసి కన్ను కొట్టడం కనిపించింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సందర్భంగా 11 మంది పూజారుల దగ్గర రాహుల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత 15 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రాహుల్‌తోపాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.

Next Story
Share it