Top
Sneha TV

తీర్మానాలు, ప్రతిజ్ఞలు ఓటర్ల వ్యక్తిగత విషయాలు: రజత్ కుమార్

X

హైదరాబాద్: రెండు రోజుల ఓటరు నమోదుపై స్పెషల్ డ్రైవ్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలన్న తీర్మానాలు, ప్రతిజ్ఞలపై ఫిర్యాదులు అందలేదని చెప్పారు. బలవంతంగా తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్టు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తీర్మానాలు, ప్రతిజ్ఞలు ఓటర్ల వ్యక్తిగత విషయాలు అని వివరించారు. ఎవరైనా బలవంతంగా ప్రతిజ్ఞ చేయించినట్లు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. పోలింగ్ బూత్‌ల్లో పకడ్బందీగా ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీప్యాట్‌లపై చాలామంది అధికారులకు అవగాహన లేదని తెలిపారు. అవగాహక కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై తేదీల ఖరారుపై ఎలాంటి సమాచారం లేదు. మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేశారు.


ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ప్రతిరోజు ఎన్నికల అవగాహనపై కలెక్టర్లతో సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story
Share it