Top
Sneha TV

ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు సైనికుడిలా పని చేయాలి: ఎంపీ కవిత

X

హైదరాబాద్: రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్‌ఎస్‌కేవీ సమావేశానికి ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు సైనికుడిలా పని చేయాలని ఎంపీ కవిత కోరారు. కార్మికులు, ఉద్యోగులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా జీతాలు పెంచిందని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కోటి మందిని చేరుకోగలుగుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్మికులు వివరించాలని సూచించారు. ఉద్యమ సమయంలో రంగాల వారీగా సమస్యలను గుర్తించి సీఎం కేసీఆర్ వాటిని పరిష్కరిస్తున్నారని చెప్పారు. 119 నిజయోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కేవీ బలపడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 67 రంగాల్లో 25 లక్షల సభ్యత్వం కలిగి 31 జిల్లాల్లో కమిటీలు వేసుకుని సంఘం పటిష్టంగా ఏర్పడిందని చెప్పారు. ఆటో, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేశామన్నారు. ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షల ప్రమాద బీమా చెల్లిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు రూ.2లక్షల నుంచి రూ.6లక్షలకు ప్రమాద బీమా పెంచామని..


అన్ని రకాల ఉద్యోగులకు వేతనాలు పెంచామని ఎంపీ కవిత పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నారాయణ, వి. మారయ్య, నాగేశ్వర్ రావు, శారద, చిలువేరు ప్రభాకర్‌, భారతి, కె.

మాధవి, వి. మాధవి తదితరులు పాల్గొన్నారు.
Next Story
Share it