Top
Sneha TV

రోడ్లకే రూ.400కోట్లు

X
-పల్లె పల్లెకూ బ్లాక్ టాప్ రోడ్డు -మురిసిపోతున్న పల్లె జనం మరిపెడ, : ఏడు దశాబ్దాలుగా సరైన రోడ్లు లేక జనం తల్లడిల్లుండ్రు. స్వరాష్ట్రం ఏర్పాటుతో పల్లె పల్లెకు తారు రోడ్డు సౌలభ్యం ఏర్పడిందని పల్లె జనం మురిసి పోతున్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్లతో పల్లె, పట్టణ రోడ్లను తీర్చిదిద్దింది. డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పనితనానికి ఈ రోడ్లు సూచికలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలోనే సీనియర్ రెడ్యానాయక్ ప్రతి పల్లెకు తారు రోడ్డేసే ఓట్లు అడుగుతానని తనకు తాను ప్రతీ సభలో సవాల్ విసురుకున్నారు. ఈ క్రమంలో రెడ్యా సీఎం కేసీఆర్‌కు తన ప్రజలకు ఇచ్చిన హామీని వివరించి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి ఈ నాలుగేళ్లల్లోనే రూ.400కోట్లు మంజూరు చేయించి పల్లె పల్లెకు, తం డాతండాకు తారు రోడ్లేపించారు.

మరిపెడ మండలం తానంచర్ల ఒక్క గ్రామానికే 24 తండాలు ఉండగా అన్ని తండాలకు బ్లాక్ టాప్ రోడ్డేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రెడ్యాకే దక్కింది. ఆరేడు ఏళ్ల కిందట ఈ గ్రామానికి చెందిన జాల్ తండా, సఫావట్, డక్నాతండాలతో పాటు తదితర తండాల్లోని ప్రజలకు జ్వరం వచ్చినా, ఏ ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కాళ్ల మంచం, కావడే దిక్కు అయ్యేది. ఇప్పుడు రోడ్ల అభివృద్ధితో ఇబ్బందులు తప్పాయని తండాల వాసలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.170.01 కోట్లతో 182.8 కిలో మీటర్లు ఆర్‌అండ్‌బీ రోడ్లు డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా రూ.170.01కోట్లతో 182.8 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 150.36 కిలోమీటర్లు డబుల్ రోడ్లు కాగా, 29 కిలోమీటర్లు కొత్తగా మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చడం జరిగింది. నియోజకవర్గంలోని డబుల్ రోడ్లుగా మార్చినవి డోర్నకల్ సీతారాంపూర్ రోడ్డు 9.6 కి.మీ, రూ.10కోట్లు, కాంపెల్లి టు చింతపల్లి 10కి.మీ, (రూ.10కోట్లు), కందికొండ టు చిన్నగూడూరు 14.1కి.మీ (రూ.18కోట్లు), జంగిలికొండ టు నర్సింహులపేట 12.5కి.మీ (రూ.15కోట్లు), బాల్నిధర్మారం-చింతపల్లి రోడ్డు 10.1కి.మీ, (రూ. 13కోట్లు), పీఎస్ గూడెం-ఎల్లంపేట రోడ్డు 14.45కి.మీ (రూ.14కోట్లు), ఉగ్గంపల్లి-నర్సింహులపేట రోడ్డు 7కి.మీ, (రూ.7కోట్లు), గిరిపురం టు ఎల్లంపేట స్టేజి 7కి.మీ, (రూ.10కోట్లు), రాంపురం-గిరిపురం రోడ్డు 7.6కి.మీ, (రూ.10కోట్లు), ఎల్లం పేటస్టేజి నుంచి చిన్నగూడూరు వరకు 10కిమీ. (రూ.13కోట్లు), చిన్నగూడూరు నుం చి శనిగపురం రోడ్డు 13కి.మీ, (రూ.15కోట్లు), కురవి టు ఇల్లందు రోడ్డు 9 కి.మీ, (రూ.10కోట్లు), డోర్నకల్ టు మహబూబాబాద్ 20కి.మీ, (రూ.

20కోట్ల) డబుల్ రోడ్లుగా మార్చడం జరిగింది. అదే విధంగా 29 కి.మీ మట్టి రోడ్లను రూ.16.3కోట్లతో కొత్తగా తారు రోడ్లుగా మార్చడం జరిగింది. ఉప్పరిగూడెం-బలపాల 8కి.మీ, (రూ.2.4కోట్లు), తానంచర్ల-జాల్‌తండా రోడ్డు 5కి.మీ, (రూ.4.35కోట్లు), కుమ్మరికుంట్ల-నర్సింహులపేట రోడ్డు 5కి.మీ, (రూ.3కోట్లు), నారాయణపురం టు రాజోల్ 4కి.మీ, (రూ.2.4కోట్లు), మోద్గులగూడెం నుంచి కొత్తూర్‌కు 7కి.మీ (రూ.4.25కోట్ల)తో మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడం జరిగింది. సీఆర్‌ఆర్, ఎమ్మాఆర్‌ఆర్, పీఎంజీఎస్‌వై నిధులతో 132 కి.మీ బ్లాక్‌టాప్ రోడ్లు డోర్నకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 132 కి.మీ దూరంతో వివిధ తండాలను, గ్రామాలకు అనుసంధానం చేస్తూ కొత్త రోడ్లు మంజూరయ్యాయి.

ఈ రోడ్లన్నంటికి రూ.81.10కోట్లను ఖర్చు చేసి కొత్తగా తండాలకు రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మెయింటెన్స్ రూరల్ డెవలప్‌మెంట్ రోడ్ల స్కీం కింద 71 పనులకు రూ.32.50కోట్లు, కన్‌స్ట్రక్షన్ రూరల్ డెవలప్‌మెంట్ రోడ్ల స్కీం కింద 31 పనులకు రూ.23కోట్లు మంజూరు అయ్యాయి. తండాతండాకు తారు రోడ్డును చేశారు. పీఎంజీఎస్‌వై ఎల్‌ఈపీ కింద 34 పనులకు రూ.30.6 కోట్లు మంజూరి కాగా ఐదు రోడ్లు పూర్తిఅయ్యాయి. మిగిలిన 25 రోడ్లకు టెండర్‌పక్రియ జరిగింది.

వచ్చే ఉగాది వరకు పనులు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవి కాక నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ కింద రూ.23.75కోట్లు మంజూరు కాగా పల్లెలు, తండాలు, మండల కేంద్రాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది. ఇక ఐటీడీఏ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పలు కొత్తరోడ్లు, రోడ్డు డ్యాంలు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రెడ్యాకు రుణ పడి ఉంటాం : అజ్మీరా బేబిరాణి మాజీ తాజా సర్పంచ్, బాబోజీగూడెం బాబోజీగూడెం గ్రామానికి ఇది వరకు ఎడ్ల బండి కూడా సరిగ్గా వచ్చేది కాదూ.

తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృషితో సీఎం కేసీఆర్ స్పందించి గిరిపురం టు రాంపురం వరకు డబు ల్ రోడ్డు మంజూరి చేయడంతో బాబోజిగూడెం గ్రామస్తులకు రవాణా సౌకర్యం సులభమైంది. దీంతో పాటు వాగొడ్డుతండా, వెంకురాంతండాలకు సీసీఆర్, ఎమ్మార్‌ఆర్, ఐటీడీఏ నిధులతో రోడ్లేశారు. అందరం సీఎం కేసీఆర్, తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యాకు అండగా ఉంటాం. కంకర రోడ్లపై నడిచేటోళ్లం..

బోడా బుజ్జి, బోడాతండా, అబ్బాయిపాలెం ఇది వరకు కంకరతేలిన రోడ్లపై నడిచేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రోడ్లు సౌలత్ మంచిగ అయ్యింది. గోడ్లు, మనుషులం పొలం, చెల్కల కాడికి వెళ్లేటప్పుడు రోడ్లపై ఉన్న కంకర రాళ్లు గుచ్చుకుంటే పాణాలు పోయేవి. ఇప్పుడు మా తండాకు తారు రోడ్డు వేశారు.

అందరం సుఖ ప్రయాణం చేస్తున్నాం. పెద్ద పిల్లలు సైకిళ్లు, చిన్న పిల్లలు అటోలు, బస్సుల్లో బడికి వెళ్లుతున్నారు. నీలికుర్తి తండాలన్నింటికీ తారు రోడ్లే బానోతు మనోహర్‌నాయక్ మాజీ సర్పంచ్, నీలికుర్తి. మరిపెడ మండలం నీలికుర్తి గ్రామ తండాలన్నింటికీ తారురోడ్లే ఉన్నాయి.

తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ నాలుగేళ్లల్లో సీఎం కేసీఆర్ సహాయంతో సీఆర్‌ఆర్, ఎమ్మార్‌ఆర్ నిధులను మంజూరు చేసి దాస్యతండా, మూన్యతండా, రేఖ్యతండా, ప ర్కాజల్ తండాలకు పక్కా రోడ్లు వేయించారు. ఈ తండా ప్ర జలందరం టీఆర్‌ఎస్ సర్కారుకే ఓటేస్తాం. గతంలో దా స్యతండా, మూన్యతండా, రేఖ్యతండాలకు ఆటోలు వచ్చేవి కావు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు రావడం వల్ల పిల్లలను బడికి పంపుకోగలుగుతున్నాం.
Next Story
Share it