Top
Sneha TV

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

X

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి నవాబ్‌పేట: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని చేవెళ్ల ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని చిట్టిగిద్ద, యావపూర్‌ గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించి, కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడం, బదిలీ, సవరణలు చేసుకోవడానికి ఈనెల 25వరకు గడువు ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో మొత్తం 49 బూత్‌లలో కొత్తగా ఓటరు నమోదుకు - 343, సవరణలకు- 58, తొలగించేందుకు- 49 అర్జీలు అందాయన్నారు. ఈయన వెంట తహసీల్దారు శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Next Story
Share it