Top
Sneha TV

బహుజనులకే రాజ్యాధికారం కట్టబెట్టాలి

X
బహుజనులకే రాజ్యాధికారం కట్టబెట్టాలి పరిగి: పరిగి నియోజకవర్గంలో బహుజనులకే ఈ ఎన్నికల్లో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టాలని దళిత సంఘాల రాష్ట్ర నాయకుడు కడ్మూరు ఆనందం అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ రోడ్డులోని కల్యాణ మండపంలో బీఎల్‌ఎఫ్‌ నియోజకవర్గ కన్వీనర్‌ ఎం.వెంకటయ్య అధ్యక్షతన బహుజనులకు రాజ్యాధికారం - రాజకీయ సమీకరణ అనే అంశంపై నియోజకవర్గ స్థాయిలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఐదున్నర దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ]్యం వహిస్తున్నారని చెప్పారు. వారి వయస్సు పైబడినా వారి వారుసులకే అవకాశం కల్పిస్తున్నారని కానీ పేదల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. బహుజనుల తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టి రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతూ ఓటు చైతన్యం తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు పంపిణీ చేస్తూ పేదలను మభ్యపెడుతోందని అవి కాకుండా రాజ్యాధికారం దిశగా ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో కంకల్‌ వెంకటేశం, రిటర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ ఆనందం, పదవీ విరమణ డీఎస్పీ రాములు, ఐకాస తాలుకా కన్వీనర్‌ ఎం.నాగేశ్వర్‌, కె.నర్సమ్మ, బీఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు గోపాల్‌నాయక్‌, మంగమ్మ, హబీబ్‌, రామకృష్ణ, వెంకట్రాములు, ఎ.వెంకటయ్య, రమేష్‌, చందర్‌, బుగ్గయ్య, కిష్టయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
Next Story
Share it