Top
Sneha TV

కలిసుందామని టీఆర్‌ఎస్‌ను చాలాసార్లు కోరాం: చంద్రబాబు

X

అమరావతి: తెలుగుజాతి కోసం కలిసుందామని టీఆర్‌ఎస్‌ను చాలాసార్లు కోరామని, టీఆర్‌ఎస్‌ మొన్నటి వరకు హోదాకు సహకరించిందని, ఎన్డీఏ నుంచి బయటకురాగానే టీఆర్‌ఎస్‌ వైఖరి మారిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తెలుగుజాతి కోసం బాబ్లీపై పోరాడామని, బాబ్లీపై మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం నోటీసులు పంపిందని చంద్రబాబు తెలిపారు.

''నాకు మెచ్యూరిటీ లేదన్న ప్రధాని మోదీ.. విభజన సమస్యల పరిష్కారానికి ఒక్క మీటింగ్ అయినా పెట్టారా? రాష్ట్ర విభజన తర్వాత ఎలా ఉన్నారని కూడా అడగలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాని తగవులు పెడుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లను పెంచడానికి కూడా మనసు రాలేదు. తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని బీజేపీ నేతలే ఏకపక్షంగా చెప్పారు. పథకం ప్రకారం మమ్మల్ని బలహీనపర్చాలని చూశారు. ఏపీలో వైసీపీతో లాలూచీ పడ్డారు'' అని చంద్రబాబు ఆరోపించారు.

Next Story
Share it