Top
Sneha TV

పైలెట్లు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు

X

బెంగుళూరు: సోషల్‌ మీడియా కారణంగా కేవలం యువతపైనే కాదు ఆర్మీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. సోషల్‌ మీడియాలో అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తూ ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌ రహస్యాలను దొంగలించేందుకు శత్రుదేశాలు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా కారణంగా భారత పైలెట్ల సామర్ద్యం దెబ్బతింటుందని వాయుసేన చీఫ్‌ మార్షల్‌ బిఎస్‌ ధనోవా తెలిపారు. సోషల్‌ మీడియాలో ఎక్కువ సేపు గడపటం వలన పైలెట్లు నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా సిబ్బంది మధ్య సమన్వయం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. బెంగుళూరులో జరిగిన 57వ ఇండియన్‌ సోసైటీ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు

Next Story
Share it