Top
Sneha TV

నిరుద్యోగ భృతి సూపర్‌ డూపర్ హిట్టవుతుంది: లోకేష్

X

అమరావతి: నిరుద్యోగ భృతి సూపర్‌ డూపర్ హిట్టవుతుందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఏపీని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుస్తామని, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తూనే ఆయా రంగాల్లో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాలు చేతులెత్తేశాయని, ఆయా రాష్ట్రాల్లో లోపాలను గుర్తించామని, ఏపీలో ఆ పరిస్థితి రానివ్వమన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులను గుర్తించామని, నిరుద్యోగ భృతికి 22 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని లోకేష్‌ తెలిపారు.

Next Story
Share it