Top
Sneha TV

ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసు.. వాటాలీ బెయిల్‌పై సుప్రీం స్టే..

X

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసులో కశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వాటాలీకి ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్ సహా పలువురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు గతేడాది వాటాలీని అరెస్ట్ చేశారు.

ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ తిరస్కరించినప్పటికీ ఢిల్లీ కోర్టులో ఆయనకు బెయిల్ దక్కడంతో... ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసులో విచారణ కీలక దశలో ఉన్నందున వాటాలీకి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎన్ఐఏ వాదనతో ఏకీభవించింది. ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్ఐఏ పిటిషన్‌పై వాటాలీ సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

Next Story
Share it