Top
Sneha TV

చంద్రబాబుకు వారెంట్‌ ఆ ఇద్దరి కుట్రే: సోమిరెడ్డి

X

నెల్లూరు: ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వారెంట్‌ ఇస్తూ నోటీసులు జారీ చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారి అవుతుందనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని, పోలీసులు అరెస్టు చేస్తే ఐదు రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చారని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ కలిసి చేస్తున్న కుట్ర అన్నారు. బాల్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్‌ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. భాజపా వ్యతిరేకులను అణగదొక్కడమే మోదీ ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు. మోదీ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయడాన్ని నిరసిస్తూ రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.


మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు వాపసు తీసుకోవాలన్నారు. లేకపోతే ప్రజల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు

Next Story
Share it