Top
Sneha TV

రూపాయి: ఈ పతనం దేనికి ఆరంభం?

X

పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా విపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్ నిర్వహించాయి. ఇది ఇంకా ఆరంభమేనని.. ముందుంది ముసళ్ల పండగని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారంలో పెట్రోల్ ధర 25 శాతం, డీజిల్ రేటు 13 శాతం పెరిగాయి.

నిజానికి రూపాయి విలువ పతనం అంతకుమించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఆసియాలో ఈ ఏడాది ఇంతవరకు దారుణంగా పతనమవుతున్న కరెన్సీ రూపాయే. డాలర్‌తో మారకం విషయంలో ఈ ఏడాది రూపాయి విలువ 13 శాతం పడిపోయింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండడం.. నూతన మార్కెట్ ఆర్థిక వ్యవస్థల నుంచి అనేకమంది విదేశీ మదుపరులు బయటపడుతుండడం.. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ఆసియాలో పెట్టుబడులకు మదుపరులు వెనక్కుతగ్గుతుండడం.. వంటివన్నీ దీనికి కారణాలే.

ఏప్రిల్, జూన్ మధ్య భారత్ ఫారెక్స్ నిల్వలు 11 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో అమెరికా డాలర్లను విక్రయించే ప్రయత్నం చేసింది. అయినా పరిస్థితులు చక్కబడలేదు

Next Story
Share it