Top
Sneha TV

మా ఇంటి ఓట్లన్నీ విద్యాసాగర్ రావుకే అంటూ...

X

ఇబ్రహీంపట్నం: తమ ఇంటి ఓట్లన్నీ టీఆర్ఎస్‌ అభ్యర్థి విద్యాసాగర్ రావుకే అంటూ ఓ ఇంటి యజమాని తన ఇంటి గోడకు వాల్ పెయింటింగ్ వేయించాడు. ఇప్పుడు అది జగిత్యాల జిల్లాలో హల్ ఛల్ చేస్తోంది. ఈ ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేయడంతో.. దీనిపై మరింత చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన పొడేటి భూమయ్య తన ఇంటి బయట గోడపై.. తమ ఓట్లన్నీ టీఆర్ఎస్‌కే అని రాయించాడు. తాను టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలనుకున్నానన్నది ఆ గోడపై క్రమంగా స్పష్టంగా రాయించాడు. ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టినందుకు, 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మీద్వారా తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచినందుకు ఓటు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

Next Story
Share it