Top
Sneha TV

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్

X

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో తెలుగు తమ్ముళ్లు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన విజయ మాల్యాకు సహకరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండని కేంద్రానికి సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకి పేరులోనే పెద్ద కన్నం ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే కన్నా.. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని జలీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మహా కూటమి అంటే ప్రధాని మోదీకి భయమేస్తోందని అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నారని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. కాగా గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

Next Story
Share it