Top
Sneha TV

'ఆపరేషన్ గరుడ'పై మాణిక్యాల రావు తాజా వ్యాఖ్యలివీ..

X

అమరావతి: 'ఆపరేషన్ గరుడ' అంటూ హీరో శివాజీ చెప్పిన మాటలు సరిగ్గా నాలుగు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన శివాజీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి త్వరలోనే ఓ కేంద్ర సంస్థ నుంచి నోటీసులు వస్తాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలు ఎందుకు నోటీసులిస్తారు.. నోటీసులివ్వాల్సిన అవసరం కేంద్రానికి ఏముంది..? అసలు శివాజీ చెబుతున్నవన్నీ అబద్ధాలా.. లేదా నిజాలా..? అని ఏపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే వ్యవహారంపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై తాజాగా మాజీ మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. " ఆపరేషన్‌ గరుడ అనేది అవాస్తవం. శివాజీతో టీడీపీ నేతలే ఇలా మాట్లాడిస్తున్నారు. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కోరారు. ఆపరేషన్‌ గరుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలి.

ఒక వేళ అది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరాము" అని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మాజీ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it