Top
Sneha TV

అమరవీరుల కోసం కోదండరాం దీక్ష

X

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరించిందని.. అమర వీరుల కుటుంబాలు, జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. తెరాస ఇచ్చిన "ప్రపంచం గర్వించదగ్గ అమరవీరుల స్తూపం నిర్మాణం" హామీపై జాప్యాన్ని నిరసిస్తూ కోదండరాం ఈరోజు జనసమితి పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

అంతకుముందు అఖిలపక్ష నేతలతో కలిసి కోదండరాం గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు ప్రభుత్వం న్యాయం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడిస్తామని అమరవీరుల కుటుంబాలు హెచ్చరించాయి.

Next Story
Share it