Top
Sneha TV

ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆకలి బాధితులే

X

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఐక్య రాజ్య సమితి నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో సరైన తిండిలేని వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందని 'పోషకాహా రం-ఆహార భద్రత'పై రూపొందించిన నివేదిక వెల్లడించింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 82.1 కోట్ల మంది సరైన పోషకాహారం అందక బాధ పడుతున్నారని.. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస వివరించింది. తీవ్ర స్థాయిలో వర్షాలు లేదా అధిక ఉష్ణోగ్రతలతోపాటు కరువు, తుఫానులు, వరదల వంటి విపత్కర పరిస్థితుల వల్ల ఆకలి బాధితులు పెరుగుతున్నారని పేర్కొంది.

Next Story
Share it