Top
Sneha TV

కొందరు గురువారం... మరికొందరు ఆదివారం

X

ఆసియా కప్‌ కోసం భారత జట్టు దుబాయ్‌ పర్యటన

ముంబయి: టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటన అభిమానులను ఎంతో నిరాశ పరిచింది. అభిమానులు త్వరగా దీన్ని మర్చిపోయేందుకు మరికొద్ది రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉండటం విశేషం.

ఇదిలా ఉండగా మంగళవారంతో ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటన ముగిసింది. త్వరలో కోహ్లీ సేన భారత్‌లో అడుగుపెట్టనుంది. అయితే, ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు సభ్యులు రెండు విడతలుగా దుబాయ్‌ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో లేని వారు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లు గురువారం దుబాయ్‌ బయలుదేరనున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి తిరిగొచ్చే శిఖర్‌ధావన్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు ఆదివారం దుబాయ్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

టోర్నీలో భాగంగా భారత్‌ తన తొలి మ్యాచ్‌ను 18న హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజు అంటే 19న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

Next Story
Share it