Top
Sneha TV

కౌశల్ ఫై బిగ్ బాస్ కుట్ర ?

X

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశలకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.వీక్ బై వీక్ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అతడిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చివరి వారంలో కౌశల్ తో ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడించబోతున్నాడట బిగ్ బాస్, దాని పేరు రూలర్ గేమ్. ఈ గేమ్ లో హౌస్ ని బిగ్ బాస్ సిటీగా మార్చి హౌస్ మేట్స్ ని ప్రజలుగా , కౌశల్ ని కింగ్ గా ప్రకటించనుందట. హౌస్ మేట్స్ అంతా కింగ్ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాదని ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలను కింగ్ విధించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్ ని ఎలిమినేట్ చేసేందుకు, లేదంటే అతని క్రేజ్ ను తగ్గించేందుకు యత్నిస్తోందట బిగ్ బాస్ టీమ్.

ఈ గేమ్ ను హిందీలో సీజన్ 8లో విపరీతమైన క్రేజ్ ఉన్న గౌతమ్ గులాటీతో ఆడించారు. ఈ టాస్క్ కారణంగా హౌస్ మేట్స్ అంతా అతనికి యాంటీ అయ్యారు. మిగిలిన హౌస్ మేట్స్ ఫై బయట సింపతీ బాగా వర్కవుట్ అయింది. ఫైనల్ లో గౌతమ్ విన్నర్ అయినా ఓట్లు మాత్రం భారీగా స్ప్లిట్ అయ్యాయి. తమిళ్ లో కూడా ఐశ్వర్య దత్తతో ఆడించారు. ఇక అక్కడితో ఆమెకు బయట బాగా వ్యతిరేకత వచ్చింది.మిగిలిన హౌస్ మేట్స్ ఫై సింపతి వర్కవుట్ అయింది. దీనినే మరాఠి బిగ్ బాస్ లో కూడా అమలుచేసారు. ఇక్కడ కూడా సేమ్ జరిగింది.

కింగ్ ని బిగ్ బాస్ గైడ్ చేస్తూ ఉంటాడు. హౌస్ మేట్స్ తో చేయించాల్సిన పనులు , వారు ఎదురు తిరిగితే విధించాల్సిన శిక్షలు మొదలైన వాటన్నిటిని బిగ్ బాస్ గైడ్ చేస్తాడు.చేయించే పనులు, విధించే శిక్షలు కారణంగా చూస్తున్న ప్రేక్షకుల్లో హౌస్ మేట్స్ ఫై సింపతి వర్కవుట్ అయి , కింగ్ ఫై ద్వేషం కలగక మానదు. కాబట్టి కౌశల్ ని ఈ టాస్క్ లో భాగంగా కింగ్ ని చేసి ఎలిమినేట్ చేయాలనో లేదంటే అతని క్రేజ్ ను భారీగా తగ్గించేయాలనో బిగ్ బాస్ టీమ్ యోచన చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీనిపై కౌశల్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story
Share it