Top
Sneha TV

భర్త అంధుడు కావడంతో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి ఎంత పని చేసిందంటే..

X
  • సొంత ఇంటికే కన్నం
  • 16 తులాల బంగారం, రూ. 2లక్షల 35వేలు దోచేసిన కోడలు
  • ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు
  • న్యాయం చేయాలంటూ అత్తమామల వేడుకోలు

జగన్నాథపురం(సంతబొమ్మాళి)(విజయనగరం జిల్లా): ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టుకోలేడు అన్న సామెత గుర్తొచ్చిందేమో, ఏకంగా తమ ఇంట్లోనే 16 తులాల బంగారం, రూ.2లక్షల 35వేలు నగదును దోచేసింది ఓకోడలు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన మండలంలోని తీరప్రాంతం జగన్నాథపురంలో జరిగింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ఈ మేరకు వివరాలు అందించారు.

జగన్నాథపురానికి చెందిన ముత్తు రామారావు, పుణ్యావతి దంపతుల కుమారుడైన పుష్పరాజుకు నరసన్నపేటకు చెందిన సొంత మేనకోడలు నాగమణితో 12ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. పుట్టుకతో భర్త పుష్పరాజు గుడ్డివాడు కావడంతో ఈమె ఆడిందే ఆటగా సాగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక ఆటోడ్రైవర్‌తో అక్రమ సంబంధం నడుపుతోంది. ఇంతటితో ఆగకుండా ఆ ఆటోడ్రైవర్‌కు బంగారం, డబ్బులు ఇవ్వాలనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 16 తులాల బంగారం, రూ.2లక్షల35వేలు నగదు దొం గలించి బీరువా తాళాలు బియ్యం డబ్బా ఆడుగులో దాచిపెట్టింది. ఏమీ తెలియనట్టుగా అత్తమామలను నమ్మించి తాళాలు పోయావని అబద్ధాలు చెప్పింది. ఇటీవల నాగమణి సోదరుడు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నవారి ఇంటికి నాగమణి వెళ్లింది. ఈ సమయంలో అత్తమామలు తాళాల కోసం ఇంట్లో వెతకగా బియ్యం డబ్బాలో తాళాలు కనిపించాయి. వీటితో బీరువా తెరిచి చూడగా బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై జూలై 14న సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల సమక్షంలో కోడలు నాగమణి తప్పు ఒప్పుకుంది. అయితే పోలీసులు దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మళ్లీ ఆగస్టు 19న గ్రామంలో పెద్దల సమక్షంలో దొంగతనం చేసిన రూ.2లక్షల35వేల నగదు, 14 తులాల బంగారం ఆటోడ్రైవర్‌కు ఇచ్చినట్లు తెలిపింది. తనవద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని గ్రామపెద్దలు అత్తమామలకు అప్పగించారు. దొంగతనం జరిగి రెండు నెలలు అవుతున్నా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని బాధితులు రామారావు, పుణ్యావతి విలేకరుల ముందు వాపోయారు. ఇటీవల స్థానిక మాజీ సర్పంచ్‌ పుక్కళ్ల శ్రీనివాసరావు వచ్చి రూ.3లక్షలు ఇప్పిస్తామని చెబుతున్నారని, దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చెవిటివాడని, కుమారుడు గుడ్డివాడని, ఇద్దరు మనవలు తమ వద్దే ఉన్నారని, వృద్ధాప్యంలో తమ బతుకు ఎలా గడుస్తుందని పుణ్యావతి కన్నీరుమున్నీరయ్యింది.

బాధితులే కేసు నమోదు చేయొద్దన్నారు

బంగారం పోయిన బాధితులు కేసు నమోదు చేయవద్దన్నారు. తమకు బంగారం, డబ్బులు మాత్రమే ఇప్పించమన్నారు. అందువల్లే కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేస్తే రికవరీ ఇప్పించగలం.

బి.రామారావు, ఎస్‌ఐ, సంతబొమ్మాళి

Next Story
Share it