Top
Sneha TV

అంగన్‌వాడీలకు రూ.3000 నుంచి 4500కు గౌరవ వేతనం

X

అంగన్‌వాడీ కార్య కర్తలకు, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి మాట్లాడారు. పోషన్‌ మిషన్‌లో, పౌష్టికాహరలోపం లేకుండా చిన్నారులు, గర్బిణీలను కాపాడడంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల పాత్రను అభినందించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు ప్రోత్సహాకాలను రెండింతలు పెం చుతున్నట్లు ప్రకటించారు. ఆశా వర్కర్లు, హల్పర్లకు ప్రధా నమంత్రి జీవన్‌ జ్యోతి బీమా కింద ఉచితంగా బీమా కల్పించనున్నట్లు తెలిపారు.

అంగన్‌వాడీలకు రూ.3000 నుంచి 4500కు గౌరవ వేతనం పెంచు తున్నామని ప్రకటించారు. గే 2200 గౌరవవేతనం పొందుతున్న వారికి 3500, అంగన్‌వాడీ హెల్పర్లకు 1500 నుంచి 2250కు పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఐసిడిఎస్‌స్ఖిఎఎస్‌ టెక్నాలజీ ఉపయోగించే అంగన్‌వాడీలకు ప్రోత్సహాకాలను 250 నుంచి 500 వరకు ఇస్తామని తెలిపారు.

Next Story
Share it