politicalజాతీయం

ఆర్టికల్ 370 రద్దు పై లోకసభలో గందరగోళం

జమ్మూకశ్మీర్‌పై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. జమ్మూకశ్మీర్ విభజన బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ పాకిస్థాన్‌లో అంతర్భాగమని, జమ్మూకశ్మీర్ గురించి తాను మాట్లాడితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు కూడా వర్తిస్తుందని అన్నారు.

కశ్మీర్ విషయంలో కేంద్ర నియమాలు ఉల్లంఘించిందని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, భారీ భద్రతా బలగాలను దింపి కశ్మీర్‌ను జైలుగా మార్చిందని కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ నిలదీయడంపై అమిత్‌షా సూటిగా స్పందించారు. పార్లమెంటు అధికారాలను కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నట్టుగా ఉందన్నారు. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉందన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి అనుమతి తీసుకోవాలని కాంగ్రెస్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. యూఎన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. పార్లమెంటుకు ఉన్న అధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెగేసి చెప్పారు. ఆక్రమిత కశ్మీర్ అనేది జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగమని ఆయన పునరుద్ఘాటించారు….