6
అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత ధూళిపాళ్లను పెళ్లాడిన సంగతి తెలిసిందే. త్వరలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. (అఖిల్ అక్కినేని వెడ్డింగ్)
నవంబర్ లో జైనాబ్ రావడ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు. మార్చి 24న అఖిల్-జైనాబ్ వివాహం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.