విజయవాడ, ఈవార్తలు : హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందేనని హైందవ శంఖారావంలో డిక్లరేషన్ వీహెచ్పీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో భారీ బహిరంగ సభ జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన హిందువుల సమక్షంలో, సభ సాక్షిగా.. ఆలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేసింది. అలాగే.. ‘హిందూ దేవాలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదు. చట్టవిరుద్ధంగా దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయకచవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి. హిందూల్లో ఆలయ అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి’ అని డిమాండ్ చేసింది.
‘హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి. ట్రస్టు బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలి. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. అన్యాక్రాంతం ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలి. దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి. దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనేక ఆలయాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తిరిగి అప్పగించాలని చెప్పింది.
మహా కుంభమేళా | 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా విశేషాలు.. పూర్తి వివరాలు ఇవిగో..
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు