మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో… హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను ‘మార్కో’ తీసుకుంది. ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా… తొలిసారిగా హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న ‘మార్కో’ అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.
ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసింది ఈ హనీఫ్ అదెని దర్శకత్వంలో క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్‌కు లభిస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని… మరిన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ‘జినీవర్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
‘జినీవర్స్’ అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ… ‘బాహుబలి, కె.జి.ఎఫ్, కాంతార, తాజాగా పుష్ప-2’ చిత్రాల గురించి మాట్లాడుకున్నట్లుగా… ‘మార్కో’ గురించి మాట్లాడుతారని కచ్చితంగా చెప్పవచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మార్కో’ హిందీ వెర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే రేపాటి నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం’ అన్నారు.