ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన పుష్ప 22 సినీ హీరో అల్లు అర్జున్ వ్యవహారం ఆయన మామ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకంలో పడేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో కాంగ్రెస్, అల్లు అర్జున్ మధ్య ప్రభుత్వం కోల్పోయిన వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు గాంధీ భవన్ కు వచ్చారు. మున్షీతో భేటీ అయ్యేందుకు చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ లోని ఆమె ఆఫీస్ కు వెళ్లారు. దీపాదా మున్షీకి ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్‌తో చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వలేదు. తర్వాత దీపాదాస్ మున్షి ఆయన్ను కలిశారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో ఉండటంతో ఆయన్ను కలవలేకపోయారు.
అదే సమయంలో గాంధీభవన్ కు వచ్చిన చంద్రశేఖర్ గౌడ్ ను కలవలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడంతో.. మహేశ్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నందునే కలవలేకపోయానని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ చీఫ్.. బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని నేను మీడియా సమావేశంలో ఉన్నందున ఆయనను కలవలేకపోయానన్నారు. అయితే దీపాదాస్ మున్షీని ఆయన కలిశారన్న అధ్యక్షుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడదామని చెప్పినట్లు వివరించారు. అల్లు అర్జున్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతున్న ఈ భేటీతో కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని గ్రహించి కావాలంటే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ, చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వలేదా ? లేక నిజంగా ఆయన ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చారా? అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రేవతి కుటుంబానికి మైత్రీ బాసట..!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ‘పుష్ప 2’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అండగా నిలిచింది. ఈ మేరకు సోమవారం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత నవీన్.. రూ.50 లక్షల చెక్కును ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి భాస్కర్‌కు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, ఈ 4వ తేదీన 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుడు శ్రీతేజ్ పేరుతో ఓ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఆయన చూపించాడు. దీని ద్వారా సాయం అందించి బాలుని భవిష్యత్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.